మామునూరు ఎయిర్ పోర్టు నిర్మించాలన్నది ఎప్పటి నుంచో చిరకాల కోరిక అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్టు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కి పెరిగింది.
మోడీకి ముందు 2014లో దేశంలో 76 ఎయిర్ పోర్టులు ఉండేవి. మోడీ ప్రధాని అయిన తరువాత పదేళ్లలో 159 విమానాశ్రయాలు పెరిగాయి. ఉడాన్ స్కీమ్ వల్ల చిన్న నగరాలకు కూడా విమానయాన ప్రయాణం విస్తరించింది. నువ్వే ఏపీకే కాదు.. తెలంగాణకు, యావత్ దేశానికి మంత్రివి అని చంద్రబాబు నాకు పలు సూచనలు చేశారు. ఏపీ అభివృద్ధితో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని చెప్పారు. మామునుర్ ఎయిర్ పోర్ట్ కి ప్రస్తుత రన్ వే 1600 మీటర్లు ఉంది. ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల రన్ వే అవసరం. అందుకే ఆలస్యం అయిందని తెలిపారు మంత్రి రామ్మోహన్ నాయుడు.