తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై రాత్రి అన్న ప్రసాదంలోనూ వడల వడ్డించనున్నారు. ఈ మేరకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడల పంపిణీని ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.

ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందిస్తామని పేర్కొన్నారు బీఆర్ నాయుడు. దింతో తిరుమల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.