తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు దారి చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవా ళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ అదిలాబాద్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట, మెదక్ అలాగే హుస్నాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది.
అంతేకాదు రేపు అదిలాబాద్ అసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరికలు జారీ జెరీ చేసింది. ఇక నిన్నటి నుంచి వర్షాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో కూడా ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం పడుతోంది.