నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

-

ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, ఇతర కారణాల వల్ల జరుగుతున్న ఈ ప్రమాదాల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్యాసింజర్ రైళ్లే కాకుండా గూడ్స్ రైళ్లు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్‌లో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డ్‌లోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. బిట్రగుంట రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపు ఉన్న 144వ లెవెల్ క్రాసింగ్ గేటు దగ్గర గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్ ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనస్థలికి చేరుకున్నారు. తొలుత ట్రాఫిక్‌ వల్ల ఏర్పడ్డ అంతరాయాలను తొలగించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు.. అత్యవసర రైళ్లను మూడో లైన్‌లో పంపాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version