జూరాలకు పోటెత్తుతున్న వరద.. 37 గేట్లు తెరిచి నీటి విడుదల

-

జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లక్షా 70 వేల క్యూసెక్కులు ఉండగా.. 37 గేట్లు తెరిచి దిగువకు లక్ష 73 వేల 870 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 317.39 మీటర్లు ఉంది. పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గేట్లు ఎత్తి జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నారు.

మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టుకు లక్షా 15వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, లక్షా 44వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు లక్షా 44వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 27 గేట్లెత్తి లక్షా 44వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం పెరగొచ్చని, నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version