ఏపీలో సంచలనం రేపిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై రాజకీయంగా దుమారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చని ఎస్పీ తెలిపారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఒరిజినల్ కాదని ప్రకటించారు.
ఈ రిపోర్టు విడుదలైన కాసేపటికే ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో మార్ఫింగ్ అని ఆనాడే చెప్పానన్నారు. కొంతమంది దుర్మార్గులు చేసిన పని ఇదని… రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ కుట్ర చేశారని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఈ రాద్ధాంతానికి ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు గోరంట్ల మాధవ్. ఎబీఎన్, చంద్రబాబు, అయన్న పాత్రుడి కొడుకు, నారా లోకేష్ లు కలిసి కుట్ర చేశారని.. ఆగ్రహించారు. టీడీపీ పార్టీకి ఏపీలో స్థానం లేదని ఫైర్ అయ్యారు.