నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా నా భార్య బ్రాహ్మణి కడుతుందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు… అవకాయ పెట్టాలన్నా అంతరిక్షంలోకి వెళ్లాలన్న అది మహిళలకే సాధ్యం అని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా మా అమ్మను అవమానించారు…

మహిళలను చులకనగా మాట్లాడితే వారికి చెప్పండి అన్న లోకేష్ ఉన్నాడు తోలు తీస్తాడని అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. మహిళలను కించపరిచే డైలాగ్స్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కాకుండా చట్టం తీసుకురావాలన్నారు మంత్రి నారా లోకేష్.
మహిళలను గౌరవించడం మన ఇంటిని నుంచి మొదలు కావాలి… అందుకే పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు చేస్తున్న బొమ్మల్లో 50 శాతం మహిళలు, 50 శాతం పురుషులు ఉండే విధంగా మార్పు చేశానని పేర్కొన్నారు.