ఆస్తులు లాగేసుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్ గా మారిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. కాకినాడ పోర్టును కేవీ రావుకు 41 శాతం ఇచ్చి.. అరబిందో 59 శాతం లాక్కుందన్నారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. పథకాలపై అభిప్రాయాల సేకరణ చేయిస్తున్నట్టు తెలిపారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియాలను అరికడతామని చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యం పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మిషన్.. డీపీఆర్ స్థాయి నుంచి దాటి ముందుకెళ్లడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందన్నారు. జల్ జీవన్ పథకం ప్రతీ ఒక్కరికీ చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్టు అని.. మిషన్ మోడ్ లో పని చేస్తే పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని నారా లోకేష్ తెలిపారు.