ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అమరావతిలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. తొలివిడతగా 47 వేల ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది. జూలై 8 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని CRDA అధికారులు తెలిపారు. మిగతా ఇళ్లకు రెండో విడతలో పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల సీఎం జగన్ అమరావతిలో 50,793 మందికి పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పని దినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొరుగి పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అందులో పేర్కొన్నారు.