మాది 3 రాజధానుల సిద్ధాంతమైతే.. నీది మూడు పెళ్లిళ్ల సిద్ధాంతం : మంత్రి గుడివాడ

-

మాది 3 రాజధానుల సిద్ధాంతమైతే.. నీది మూడు పెళ్లిళ్ల సిద్ధాంతం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఇవాళ విశాఖపట్టణం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ. మీడియా ముందు పవన్ అన్నీ అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు.

మాది మూడు రాజధానుల విధానం… మీది మూడు పెళ్ళిళ్ళ విధానమా? సెలబ్రిటీలను చూసి జనం వస్తారు.. ఓట్లేస్తారనీ కాదు… పవన్ మూడురోజులు కాల్షీట్లు తీసుకున్నారన్నారు మంత్రి అమర్నాథ్. పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మామీద మేమే దాడి చేసుకున్నామని అంటున్నారు. మంత్రులపై దాడిచేసింది జనసేన కార్యకర్తలా? కాదా? పవన్ సూటిగా సమాధానం చెప్పాలని ఆగ్రహించారు మంత్రి అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news