తెలంగాణ జోలికి వస్తే ఏపీకి మంచిది కాదు – హరీష్ రావు

-

నోరు ఉంది కదా అని అయినదానికి, కానీ దానికి ఆంధ్రప్రదేశ్ పై నోరు పారేసుకునే తెలంగాణ మంత్రి, కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని.. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని.. అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో తెలంగాణ ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతాయని, తెలంగాణలోని స్కూళ్లకు.. ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లకు తేడా గమనించాలన్నారు.

అయితే ఏపీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. తెలంగాణ జోలికి వస్తే ఆంధ్రప్రదేశ్ కే మంచిది కాదని అన్నారు. విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మినా, ప్రత్యేక హోదా హామీని ఎగ్గొట్టినా.. కేంద్రాన్ని అడగలేని దుస్థితిలో మీరు ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. కేంద్రంలో బిజెపి ప్రాపకం కోసం ఏపీలో అధికార, విపక్షాలు ఉన్నాయన్నారు. వైసిపి, తెలుగుదేశం పార్టీలు కలిసి ఏపీని ఆగం చేశాయని మండిపడ్డారు హరీష్ రావు. ఆంధ్ర మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version