షాకింగ్: బాంబ్ బ్లాస్ట్ లో స్టార్ హీరోకు గాయాలు ! 

-

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు గాయాలు తగిలాయి. తాజాగా ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న సంజయ్ దత్ కు బాంబ్ పేలడం వలన గాయాలు అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ సిటీ లోని మాగడి రోడ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం అభిమానుల్ని తీవ్రంగా బాధపడుతోంది. కేడి సినిమా లో కొన్ని ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ బాంబ్ బ్లాస్ట్ అవడంతో సంజయ్ దత్ కు మోచేయి, తల మరియు ముఖానికి గాయాలు తగిలాయి.

దీనితో షూటింగ్ ను మధ్యలోనే ఆపివేసి ప్రధమ చికిత్స అనంతరం ముంబై వెళ్ళిపోయాడు హీరో సంజయ్ దత్. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా సంజయ్ దత్ కెరీర్ లో హీరోగా ఒక వెలుగు వెలిగినా ఇప్పుడు విలన్ గా మారి వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈయన నటించిన కే జి ఎఫ్ 2 లో చేసిన అధీరా పాత్రకు మంచి ప్రాముఖ్యత లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version