టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒకరోజు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. సెలవుల తరువాత ఇవాళ విచారణ చేపట్టింది.
చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే తో పాటు మరో లాయర్ వాదనలు వినిపించారు. సీఐడీ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే అక్టోబర్ 09కి సుప్రీంకోర్టు కేసును వాయిదా వేసింది. చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా వాదనలు కొనసాగించాలని అభ్యర్థించారు. కానీ సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరికాదన్నారు. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదించారు. 17ఏ కేసు చంద్రబాబుకు వర్తించదని.. బెయిల్ కోసం ప్రయత్నించకుండా క్వాష్ అడుగుతున్నారు సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ ఈనెల 09కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరోవైపు హైకోర్టు దాఖలు అన్ని సర్టిఫికెట్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.