ఏపీలో షూటింగ్‌ చేయడంపై హీరో సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలో షూటింగ్‌ చేయడంపై హీరో సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన హీరో సుమన్….అనంతరం మాట్లాడారు. ఎన్నికల రిజల్ట్ తరువాత అందరూ బిజీగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలవలేదు….రేపు ప్రోగ్రాం ఉంది.. అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని కర్టసీగా కలుస్తున్నానని తెలిపారు. ఏపిలో అవకాశం కల్పించడం, స్టూడియోలు కట్టడం మాత్రమే కాదు…. ఈ రోజుల్లో చిన్న సినిమాలు ఆడాలంటే లోకేషన్లు బాగా ఉండాలని తెలిపారు.

Hero Suman’s sensational comments on shooting in AP

పెద్ద సినిమాలు 20శాతం మాత్రమే ఏపీలో తీసి మిగిలినవి విదేశీ లోకేషన్లలో తీస్తున్నారు…తమిళ, మళయాళ సినిమాలు రాసే కథల్లో స్వేచ్చ ఉంటుంది…వారు ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారని వివరించారు. హైదరాబాద్ కు ఇండస్ట్రీ రావాలని ఇక్కడే సినిమాలు తీయాలని 20 శాతం బయట తీయాలని అప్పట్లో రూల్ పెట్టారని… ఇక్కడి లోకేషన్లన్ని ఇప్పటికే తీసేసాం.. ప్రేక్షకులు కొత్త లోకేషన్లు ఉంటే తప్ప సినిమాలను ఆదరించడం లేదని వెల్లడించారు. పెద్ద సినిమాలకు సెట్స్ వేయడానికి డబ్బు ఉంది.. చిన్న సినిమాలకు అది సాధ్యం కాదు…. తెలుగు సినిమాలు సక్సెస్ అయితే అవి కూడా డబ్బింగ్ అవుతాయన్నారు. లోకేషన్ల విషయంలో కండిషన్లు వద్దు, చిన్న సినిమాలకు మరింత ఫ్రీడం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version