బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.నాలుగు గోడల మధ్య మేము నిర్ణయాలు చేయడం లేదని, మాది ప్రజా ప్రభుత్వమని ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం కేంద్రం తో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది పెట్టిందని..రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి అవినీతి లాంటి అనేక విధ్వంసమ్ చేశారనిఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నామ మాత్రంగా కూడా మిగలదు… పేకమేడలా కూలిపోతుంది… వారే కూల్చుకుంటున్నారని అన్నారు.ధనిక రాష్ట్రం అని బయటకి గొప్పలు చెప్పి లోపల అప్పులు చేసిందని మండిపడ్డారు.కేంద్రం నుండి సాయం అడిగితే నామోషీ అని మిషన్ భగీరథ లాంటి వాటికి నిధులు అడగలేదని బీఆర్ఎస్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.