ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. దీనికి బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, జగిత్యాల, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సంజీవ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రెటరీ డా.వి నరసింహా చార్యులు, అధికారులు ఉన్నారు.
కాగా, హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ పాద రావు 87వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సీఎం రేవంత్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.