కరెంట్ షాక్ తగలడంతో ఒకేసారి నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సెయింట్ ఆంథోనీ చర్చి ఉత్సవాల కోసం డెకరేషన్ చేయడానికి ఇనుప నిచ్చెనను తీసుకొస్తుండగా.. అది కాస్త విద్యుత్ వైర్లకు తగిలినట్లు సమాచారం.
దీంతో నిచ్చెన పట్టుకున్న వ్యక్తులతో పాటు వారిని రక్షించబోయి మరో ఇద్దరు సైతం విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. మొత్తంగా నలుగురు వ్యక్తులు అందరూ చూస్తుండగానే విలవిల కొట్టుకుని ప్రాణాలు వదిలారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది.