కిడ్నీ రాకెట్ పై హోం మంత్రి అనిత సంచలన నిర్ణయం !

-

Home Minister Anita on the kidney racket: కిడ్నీ రాకెట్ పై హోం మంత్రి అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా చేశారు. గుంటూరు కలెక్టర్, గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన హోం మంత్రి అనిత…డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన హాస్పిటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు హోం మంత్రి ఆదేశించారు.

Home Minister Anita’s sensational decision on the kidney racket

ఇటువంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని హోం మంత్రి ఆదేశించారు. ఇక అటు కిడ్నీ అమ్మకాలకు వేర్వేరు జిల్లాల్లో ఉన్న మధ్యవర్తు లకి ప్రధాన అడ్డాగా మారింది బెజవాడ. గత ఏడాది భవానీపురం పోలీస్ స్టేషన్ లో రెండు కేసులో నమోదు అయ్యాయి. అప్పటి తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కిడ్నీ ర్యాకెట్ లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా కిడ్నీ అమ్మకం విషయంలో కీలకంగా మారింది బెజవాడ. నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు…. విచారణకు బెజవాడకు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version