విజయనగరం దారుణం జరిగింది. ఓ మహిళపై హోంగార్డ్ లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం నుంచి కుమిలి బైక్ పై వెళ్తున్న ఓ జంటను పోలీస్ వాహనంలో వచ్చి అడ్డగించాడు సదరు హోం గార్డ్. అనంతరం బైక్ పై ఉన్న వ్యక్తిని బెదిరించి మహిళను తుప్పల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు హోమ్ గార్డు.
తన కుటుంబ సభ్యుడితో కలిసి వెళ్తున్న సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన మహిళను రేప్ చేశాడు. అనంతరం బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో దిశ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడిన హోంగార్డ్ ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని దిశ సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.