వైసీపీ కోసం అరెస్ట్‌ కాదు, ప్రాణ త్యాగానికైనా సిద్ధం – ఎంపీ మిథున్‌ రెడ్డి

-

వైసీపీ కోసం అరెస్ట్‌ కాదు, ప్రాణ త్యాగానికైనా సిద్ధం అన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి. తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ అయ్యారు. నేడు మిథున్‌ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్‌ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలోనే తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ అయ్యారు.

House arrest of MP Mithun Reddy in Tirupati

ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ… ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు… ఇళ్లులు కూల్చుతున్నారని నిప్పులు చెరిగారు. మా వారిని పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు…ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు… పోలిసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారన్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను…40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు…ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version