సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల లబ్ధిదారులకు రూ. 20 వేలు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బిలో బేస్మెంట్ లెవెల్, బేస్మెంట్ దశల్లో నిర్మాణం ఉన్న ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్ కింద రూ. 20వేల వరకు చెల్లిస్తోంది.
ఇప్పటివరకు 2.79 లక్షల మందికి రూ. 111 కోట్లను అందించింది. డబ్బు అవసరం ఉన్న లబ్ధిదారులను గుర్తించి వెంటనే చెల్లించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పావాలా వడ్డీకి రూ. 35 వేల బ్యాంకు రుణం ఇప్పించాలని సూచించింది. ఇది ఇలా ఉండగా. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది.