మరో ప్రమాదంలో విజయవాడ పడింది. విజయవాడలో భారీ వర్షం పడుతోంది. దింతో విజయవాడలోని ఇళ్లు నీట మునిగాయి. భారీ వర్షానికి విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి.

విజయవాడలోని బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజి సర్కిల్, అజిత్ సింగ్ నగర్ రోడ్డు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి ఇండ్లు మునిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు… పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
విజయవాడలో భారీ వర్షానికి జలమయమైన పలు కాలనీలు
నీట మునిగిన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజి సర్కిల్, అజిత్ సింగ్ నగర్ రోడ్డు
లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి మునిగిన ఇండ్లు
నీట మునిగిన రోడ్లు. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు pic.twitter.com/0txnCFsZMp
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025