రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ అలాగే ఏపీని వర్షాలు ఏమాత్రం వదలడం లేదు. ఇవాళ కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

భూపాలపల్లి, ములుగు భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో.. ఈ ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మిగిలిన జిల్లాలలో కూడా అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు… పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.