ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లలో భారీగా ఛార్జీల తగ్గింపు

-

ఏపీ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. చిత్తూరు జిల్లా ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 26 నుంచి ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలను తగ్గిస్తూ… ప్రయాణికులకు శుభవార్త వినిపించారు. చిత్తూరు నుంచి వేరే జిల్లాలకు వెళ్లే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తున్నట్టు చిత్తూరు జిల్లా ఆర్టీసీ అధికారి ఎం.భాస్కర్ ప్రకటించారు.

అందులోనూ ముఖ్యంగా కడప, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాలకు వెళ్లే బస్సుల చార్జీలను తగ్గించినట్టు వివరించారు. సవరించిన చార్జీలు ఈరోజు నుంచి అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి నెల్లూరుకు బస్సు చార్జి ఇప్పటివరకు రూ.350 ఉండగా… ఏకంగా 50 రూపాయలు తగ్గించి ప్రస్తుతం రూ. 300గా నిర్ణయించారు. అలాగే… తిరుపతి నుంచి కడపకు వెళ్లేందుకు రూ. 340 వసూలు చేస్తుండగా… దాన్ని కూడా 50 రూపాయలు తగ్గించి 290గా ఫిక్స్ చేశారు. దాంతోపాటు తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్లాలంటే రూ. 300 ఛార్జీ అవుతుండగా… 40 రూపాయలు తగ్గించి రూ.260గా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version