వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ దుయ్యబట్టారు. అనంత లాంటి జిల్లాలలో పదేళ్లలో 8 ఏళ్ళు వేరుశనగ పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉండేవని.. కరువులో ఉన్న సీమ ప్రజలను తెలుగు గంగను ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. హంద్రీ-నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని అన్నారు.
ఆ తరువాత పట్టిసీమ ద్వారా సీమకు నీటిని తరలించామని తెలిపారు. గంగా – కావేరి కలపాలని సూచించామన్నారు చంద్రబాబు. ఏపీ విభజన తర్వాత పోలవరం ద్వారా కృష్ణ – గోదావరి నదుల అనుసంధానం కోసం ప్రయత్నించామన్నారు. టిడిపి హయంలో మొత్తం బడ్జెట్ లో 9.63% ఇరిగేషన్ కోసం కేటాయించామన్నారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించారు చంద్రబాబు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. రాజకీయ కక్షతోనే కుప్పానికి నీరు అందించలేదని.. వైసిపి ప్రభుత్వానికి కమిషన్ల పైన ఉండే శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టుల మీద లేదన్నారు. రాయలసీమకు నీళ్లు ఇస్తే రతనాలసీమగా మారుతుందన్నారు చంద్రబాబు.