వినాయక చవితి పండుగపై ఏపీ పోలీసులు కీలక ఆదేశాలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నెల్లూరు జిల్లాలోని  శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద గణేష్ ఘాట్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు ఎస్.పీ కృష్ణకాంత్. గత ఏడాది నిమజ్జన సమయంలో లోటుపాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ.. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు సహకరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.

నిర్దేశిత ప్రదేశాలు, సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తి చేయాలి. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ డైవర్షన్ పై సమీక్షిస్తాం. వినాయక ప్రతిమల ఊరేగింపు నుంచి, నిమజ్జనం పూర్తయ్యే వరకూ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తగిన ముందస్తు చర్యలు చేపడతామని తెలిపారు ఎస్పీ కృష్ణకాంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version