సర్వేపల్లిలో సోమిరెడ్డి సెక్షన్లను అమలు చేస్తున్నారు – మాజీమంత్రి కాకాణి

-

వైసీపీ సీనియర్ నేత వల్లూరు గోపాల్ రెడ్డి ఇంటిని పోలీసుల సహకారంతో తహసిల్దార్ తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ మేరకు నేడు పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మాజీమంత్రి కాకాని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లు టిడిపి కార్యాలయాలుగా మారిపోయాయని మండిపడ్డారు.

సర్వేపల్లిలో సోమిరెడ్డి సెక్షన్లను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై పోలీసుల అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. సెర్చ్ వారెంట్ జారీ చేసే అధికారం కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లకు మాత్రమే ఉంటుందన్నారు.

తహసీల్దార్ ఏ అధికారంతో సెర్చ్ వారెంట్ జారీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు న్యాయబద్ధంగా పనిచేస్తే బాగుంటుందని.. సోమిరెడ్డి మెప్పుకోసం పనిచేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. తహసిల్దార్, సిఐ, ఎస్ఐ, విఆర్ఓ లపై ప్రైవేటు కేసులు వేస్తున్నామని.. అధికారులకు దమ్ముంటే సోమిరెడ్డి ఇళ్లల్లో సోదాలు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version