నా పాలనలో అప్పుల మోత.. పన్నుల వాత లేదు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పీలేరు లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అబద్దాల్లో సీఎం జగన్ పీహెచ్ డీ చేశారని విమర్శించారు చంద్రబాబు. రూ.10 ఇచ్చి.. రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ అని మండిపడ్డారు. ప్రస్తుతం పేదవాడి బతుకు చితికి పోయే పరిస్థితి తీసుకొచ్చారు. బటన్ నొక్కుడులో ఎంత దోచుకున్నారో జగన్ చెప్పాలి. నాడు లేని అప్పులు ఇప్పుడు ఎందుకు వచ్చాయో సమాధానం ఇవ్వాలని ఫైర్ అయ్యారు.
ముఖ్యంగా సీఎం జగన్ రాజకీయ వ్యాపారి అన్నారు చంద్రబాబు. మద్యం పై ఆదాయాన్ని తాడెపల్లి ప్యాలెస్ లో లెక్కేసుకోవడమే ఆయన పని అని మండిపడ్డారు. నాణ్యత లేని మద్యం వల్ల రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవో జగన్ చెప్పాలి. మద్య నిషేదం అని చెప్పి మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదన్నారు చంద్రబాబు.