నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్ధిక శాఖకి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

-

తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగాల ఖాళీలను వెంటనే రెడీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ ఖాళీలపై అప్రూవల్ ఇస్తే టీఎస్పీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లో ప్రక్రియ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్రెడ్డి తో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే టీఎస్పీఎస్సీ పై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టే విధంగా కొత్త బోర్డు ప్రభుత్వము ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోనున్నట్టు తెలిసింది. అభయహస్తం హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్ 15లోగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలను అప్లికేషన్ చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వము ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

టీచర్ల రిక్రూట్మెంట్ కు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది ఏళ్లలో ఒక్క డీఎస్సీ వేయకపోవడంతో ఐదు వేల టీచర్ల పోస్టుల భర్తీకి గా తేడాది నవంబర్లో నోటిఫికేషన్ వేయగా ఎన్నికల కారణంగా పరీక్షలు రద్దయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version