చికెన్ తినొద్దని ఏపీ సర్కార్‌ హెచ్చరికలు !

-

చికెన్ తినొద్దని ఏపీ సర్కార్‌ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ నిర్థారణ అయింది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

In the wake of the diagnosis of bird flu, the AP government has issued a warning to people to reduce consumption of chicken for a few days

ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోన్న తరుణంలోనే.. ప్రజలు కూడా వణికిపోతున్నారు. చికెన్‌ తినేందుకు భయపడుతున్నారు. మరి దీనిపై రెండు సర్కార్లు ఎలా ముందుకు వెళతాయో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version