పాడేరు ఏజెన్సీ బంద్ పై మంత్రి సంధ్యారాణి ప్రకటన చేశారు. 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని వివరించారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గిరిజనలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు మంత్రి సంధ్యారాణి.
గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని.. వివరించారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. 5ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నాడని… అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు