ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన ఐదు మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ఈనెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఆరోజున విజయనగరం వెళ్లనున్న ఆయన అక్కడ కాలేజీ తో పాటు రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల కాలేజీలను వర్చువల్ గా ప్రారంభిస్తారు.
ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిలో 150 చొప్పున 750 mbbs సీట్లు ఉన్నాయి. ఇప్పటికే కౌన్సిలింగ్ పూర్తయింది. త్వరలోనే క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక అటు నెలరోజుల పాటు జగనన్న వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా దక్కుతుందని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, అవసరమైనవారికి గ్రామాల్లోనే క్యాంపులు నిర్వహించి వైద్యం అందించడం, పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు తీసుకొచ్చారని వెల్లడించారు.