ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏపీలో కరెంటు చార్జీలు పెరగబోతున్నాయి. రేపటి నుంచి విద్యుత్ చార్జీల పెంపు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత నెల రోజులుగా దీనిపై ఏపీ ప్రభుత్వం కసరత్తులో చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు కోసం ERC ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్ సి అనుమతి మేరకు విద్యుత్ చార్జీలు పెంపుదల ఉండనుందట.
2023 -24 సంవత్సరానికి సంబంధించిన 9412 కోట్ల ఇందన సార్ తో పాటు చార్జీలను వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చిందట ERC. దీంతో యూనిట్కు 92 పైసల చొప్పున రేపటి నుంచి 2026 నవంబర్ వరకు…కరెంటు చార్జీలు వసూలు చేయనిది ఏపీ ప్రభుత్వం. 94 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ… 1500 కోట్లను ప్రభుత్వం చెల్లించబోతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే 7912 రూపాయల కోట్లు ఏపీ ప్రజలపై భారం పడబోతుందన్నమాట. అయితే దీనిపై వైసీపీ పార్టీ నిరసన తెలుపుతోంది. కానీ వైసీపీ గతంలో చేసిన తప్పిదాల కారణంగానే ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది.