ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఆర్టీసీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్టాండ్ లో గ్యారేజ్, ఇతర యూనిట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పెంపు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆయా పోస్ట్ లను బట్టి నెలకు రూ.419 నుంచి రూ.608 వరకు పెంచింది. కాగా, రేపు సీఎం జగన్ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వైజాగ్ ఐటీ టెక్ పార్కును శంకుస్థాపన చేస్తారు.