28న విశాఖలో ‘ఇన్ఫోసిస్’ ప్రారంభం కానుంది. విశాఖ రిషికొండ ఐటి పార్క్ లో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఈనెల 28 నుంచి ఐటీ కార్యకలాపాలను ప్రారంభించనుంది. తొలి విడతలో 650 మంది సిబ్బంది పనిచేయనున్నారు. త్వరలోనే మరో 1,000 మందితో ఆఫీసును నడపనుంది.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి సంస్థ ఆహ్వానం పలుకుతోంది. కాగా, అమరావతి రైతులకు 2023-24 గాను చెల్లించాల్సిన రూ. 240 కోట్ల కౌలు మొత్తాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది.
26 వేల మంది రైతులకు గాను 30వేల ఎకరాలకు కౌలు చెల్లించాల్సి ఉంది. నిన్నటి వరకు 16,395 మందికి చెందిన 18,755 ఎకరాలకు రూ. 120 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరి ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే తుళ్లూరు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.