ఎన్టీఆర్ జిల్లాలో ఆంటీతో ఇంస్టాగ్రామ్ చాటింగ్..ఆ తర్వాత కార్లతో ఫైటింగ్‌ !

-

ఎన్టీఆర్ జిల్లాలో ఆంటీతో ఇంస్టాగ్రామ్ చాటింగ్..ఆ తర్వాత కార్లతో ఫైటింగ్‌ జరిగిన సంఘటన ఇవాళ తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి మండలం తాళ్లూరులో కార్లు ధ్వంసం అయ్యాయి. Instagram ప్రేమ పరిచయం వల్ల ఈ వివాదం తలెత్తింది. గుంటూరు జిల్లాకు చెందిన వివాహిత మహిళతో తాళ్లూరుకు చెందిన యువకుడు ఇంస్టాగ్రామ్ లో చాటింగ్ చేశాడు.

Instagram chatting with aunty in NTR district

ఇక ఇరువురి పరిచయం..కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో తాళ్లూరు కు చెందిన యువకుడుతో గుంటూరు ఆంటీ పరారీ అయింది. ఇక ఈ విషయం తెలిసిన వివాహిత మహిళ ఫ్యామిలీ సీరియస్ అయింది. వివాహిత యువతి కోసం తాళ్లూరుకు చేరుకున్న ఆమె బంధువులు, యువకుడి బంధువులతో ఘర్షణకు దిగారు. అటు తగ్గేదేలే అన్నట్లు యువకుడి బంధువులు ఆగ్రహించారు. దీంతో వివాహిత యువతి బంధువులపై దాడి చేసి…వాళ్ల కార్లు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news