రాయచోటిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన ముస్లింలు

-

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో నిన్న అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయచోటి నాలుగు రోడ్ల కూడలి వద్ద అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం చేస్తుండగా.. పెద్ద‌గా డీజే సౌండ్స్ పెట్టారని టాన్న సర్కిల్ వద్ద గల పెద్ద మసీదులో వందలాది మంది ముస్లింలు రోడ్డుపైకి వచ్చి బైటాయించారు.

అనంతరం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు కావాలనే ఇరువర్గాల మధ్య మత చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. గతంలో ఈ విధముగా మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం ఎన్నడూ జరగలేదని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version