చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేసారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పేరుతో దోచుకోవాలని ప్రయత్నించారు. పేద ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఏదైనా ఉందా..? అన్నీ కాపీ కొట్టడమే అన్నారు. కర్ణాటకలో మహిళలకు బస్ లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే.. అదే ఇక్కడ చెబుతున్నారు.
చంద్రబాబు అధికారం కోసం పనిచేశారు.. కానీ అభివృద్ధి కోసం పని చేయలేదన్నారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తొలగిస్తున్నారనే విషయంపై అధికారులతో చర్చించాం. ప్రధాన కార్యాలయంతో ఈ విషయంపై చర్చిస్తున్నామని చెప్పారు. అంగన్వాడి కార్యకర్తలపై ప్రభుత్వం సానుభూతితో ఉంది. సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు అంగన్ వాఢీ ఉద్యోగులు ముందుకు రావాలి.