TDP ట్రోలింగ్కు బలైన యువతి.. అండగా వైసిపి పార్టీ ?

-

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి వాడి కొనసాగుతోంది. మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలో గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 7వ తేదీన గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

జగనన్న ఇల్లు తనకు వచ్చిందని… అమ్మ ఒడి పొందుతున్నట్లు తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది గీతాంజలి. అయితే ఇల్లు వచ్చిన ఆనందంలో.. ఫుల్ జోష్ లో మాట్లాడింది గీతాంజలి. అయితే ఇదే ఆమె కొంప ముంచింది. ఈ వీడియోను టిడిపి పార్టీ కార్యకర్తలు దారుణంగా ట్రోలింగ్ చేశారు.

ఆమె క్యారెక్టర్ ను చాలా చీప్ గా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో రైలు కిందపడి గీతాంజలి మరణించింది. ఈ తరుణంలో వైసిపి పార్టీ గీతాంజలి కుటుంబానికి అండగా నిలిచింది. గీతాంజలి ఇద్దరు పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది వైసీపీ పార్టీ. అలాగే టిడిపి సోషల్ మీడియాను కోర్టు బోనులో నిలబెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news