నేడు 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. కొత్తవలస- కోరాపుట్ సెక్షన్లు, కోరాపుట్-రాయగడ లైన్లలో డబ్లింగ్ పనులు ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో పూర్తైన భాగాలు ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ.
ఇక ప్రధాన మంత్రి మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. మార్చి 15వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ పర్యటన సాగుతుందని వెల్లడించాయి. ఇందులో భాగంగా ఈనెల 16, 17, 18వ తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. మూడు బహిరంగ సభల్లో పాల్గొని లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తామని చెప్పాయి. మోదీ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలుగుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అయితే జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిల్లో ప్రధాని సభలు నిర్వహించాలని భావిస్తోంది.