చిరు వ్యాపారులకు ‘జగన్ అన్న తోడు’ పథకంతో ఎంతో మేలు : సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జగన్ అన్న తోడు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిరు వ్యాపారులకు జగన్ అన్న తోడు పథకంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వడ్డీని రూ.13.64 కోట్లను వడ్డీని తిరిగి మళ్లీ వాళ్లకు ఇస్తున్నాం.  రూ.430 కోట్లు మొత్తంగా ఈరోజు లబ్ధి చేకూరుస్తూ వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతోంది. 8వ విడత కూడా తీసుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాల కింద ఇచ్చాం.


వాళ్ల తరఫున వాళ్లు కట్టిన వడ్డీ రూ.88.33 కోట్లు వడ్డీ తిరిగి వెనక్కు ఇచ్చాం. మొత్తం లబ్ధి దారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి, తీసుకున్నారు. 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు 2 సార్లు రుణాలు పొంది కట్టి, మళ్లీ తీసుకున్నారు. మొదటి సంవత్సరంలో రూ.10 వేలు ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇవ్వడం, సకాలంలో చెల్లించిన వారందరికీ ఏటా మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరఫున వడ్డీని వెనక్కి ఇవ్వడం జరిగింది.

ప్రతి సంవత్సరం రూ.1000 పెంచుతూ రూ.13,000 దాకా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ ను అమలు చేయడం సంతోషాన్ని కలిగించే అంశం. 16.73 లక్షల మందిలో 87.13 శాతం నా అక్కచెల్లెమ్మలే. నిజంగా ఇది మహిళా సాధికారత విషయంలో మరో విప్లవం అని కూడా చెప్పొచ్చు. మరో సంతోషాన్ని కలిగించే విషయం.. 16.73 లక్షల మందిలో 79.14 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ఈ వర్గాల వారే ఉన్నారు అని తెలిపారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version