హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ..

-

సీబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మొదలయింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కోర్టులో కేసుల విచారణ మొదలు పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను  ఈ నెల 12కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని జగన్ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేల సహా ప్రజా ప్రతినిధుల మీద ఉన్న అన్ని కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు అదేశాలు జరీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు అదేశంతో అన్ని కోర్టులకు ఈ కేసులన్నీ రోజూ వారీ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలతో కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం అయింది. జగన్ కు సంబంధించిన నాలుగు కేసుల స్టేలు ఉన్నాయి. స్టే ఉన్న కేసులను, మిగిలిన కేసులు మొత్తం ఈ నెల 12 కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు. మరో పక్క రేవంత్ రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసుని ఏసీబీ కోర్ట్ విచారణకు పిలిచింది. ప్రజా ప్రతినిధుల పై కేసుల విచారణ లో భాగంగా రోజు వారీ విచారణకు ఏసీబీ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసు తదుపరి విచారణను కూడా ఈ నెల 12 కు వాయిదా వేసింది. 12 నుంచి ఏసీబీ రోజు వారీ విచారణ జరుపనుంది కోర్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version