ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్.జగన్ లేఖ రాశారు. కృష్ణాజలాల అంశంపై లేఖ రాశారు జగన్. 1956 నాటి అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం (ISRWD)లోని సెక్షణ్ ౪ ప్రకారం కృష్ణా జలవివాద ట్రిబ్యునల్ -1 (బచావత్, KWDT -I)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. KWDT -I ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976, మే 31న దీన్ని గెజిట్ చేయడం జరిగిందని లేఖలో వెల్లడించారు. కృష్ణానదిలో 2130 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని KWDT -I ట్రైబ్యునల్ లెక్కకట్టింది.
75శాతం ప్రవాహాలు ఉంటాయన్న అంచనాతో ఈ లెక్క వేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి KWDT-I ౮౧౧ టీఎంసీల నీటిని కేటాయించింది. 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేఛ్చను ఇచ్చింది. ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం, KWDT-I చేసిన అవార్డును సుప్రీం కోర్ట్ డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు.
తదనంతరం, ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 4 (1) ప్రకారం 02.04.2004న KWDT-II (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 30.12.2010న తన ‘నివేదిక’ని సమర్పించింది. KWDT-II (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) 29.11.2013న సెక్షన్ 5(3) ప్రకారం KWDT-I ద్వారా ఇప్పటికే 75% డిపెండబిలిటీతో చేసిన 2,130 TMCల కేటాయింపులను నిర్ధారిస్తూ తన ‘తదుపరి నివేదిక’ను సమర్పించింది. దీంతోపాటు బేసిన్ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65% ఆధారపడదగిన అదనపు నీటిని కూడా కేటాయించింది.
దీని కింద, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 TMC కేటాయించబడింది. ఈ విధంగా, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మొత్తం కేటాయింపు 1005 TMC (811 TMC +194 TMC) వరకు చేరుతుంది. దీంతోపాటు 2578 TMC కంటే ఎక్కువుగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి పూర్వపు ఆంధ్రప్రదేశ్‌కు స్వేఛ్చను ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. పైన పేర్కొన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకుని, ఇందులో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదే
శించవలసిందిగా కోరుతున్నానన్నారు జగన్.