Cm jagan: ఏపీ సీఎం జగన్ ఆస్తులు విలువెంతో తెలుసా?

-

Jagan Mohan Reddy’s assets: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన బంధువులు పులివెందుల నియోజక వర్గంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Jagan Mohan Reddy’s assets

ఈ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంపద 2019 నుండి 2024 వరకు 41% పెరిగింది. ఏపీలోని కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ (51) పోటీ చేయనున్నారు. అఫీడవిట్ లోని జగన్ ఆస్తుల జాబితాను విశ్లేషిస్తే…. 2019లో రూ. 375 కోట్లుగా ఉన్న ఆయన సంపద 2024లో రూ. 529.87 కోట్లకు పెరిగిందని తేలింది. జీవిత భాగస్వామి వైయస్ భారతి రెడ్డి ఆస్తులు ఐదేళ్లలో రూ. 124 కోట్ల నుంచి రూ. 176.30 కోట్లకు పెరిగాయి. ఆయన కుమార్తె ఆస్తులతో కలిపి మొత్తం సంపద రూ.779.8 కోట్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news