నేడు సీఎం వైయస్‌ జగన్‌ అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పర్యటన*

-

నేడు సీఎం వైయస్‌ జగన్‌ అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10.40 – 12.30 గంటల వరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌.. ఏపీ సెజ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్, ఉత్పత్తులు ప్రారంభించనున్నారు.

 

మరికొన్ని పరిశ్రమలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌… మధ్యాహ్నం 12.40 గంటకు అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నివాసానికి చేరుకోనున్న సీఎం.. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. ఇక మధ్యాహ్నం 3.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version