వైసీపీలో విపరీతంగా అసంతృప్తి…కీలక నేతలు ఔట్‌ – రఘురామ

-

అధికార పార్టీలో తనతో అసంతృప్తి మొదలైందని, నలుగురు ఎమ్మెల్యేలతో మరింతగా ముదిరిందని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలలో బలమైన నాయకుడిగా పేరు ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తన మూడేళ్ల పదవీ కాలాన్ని ఉంచుకొని కూడా రాజీనామా చేస్తానని పేర్కొనడం, పార్టీలోని తీవ్ర అసంతృప్తికి నిదర్శనం అని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎదురుగా ఎవరు కూర్చోవడానికి వీలు లేకుండా కుర్చీలు వేయడం లేదని తెలిసిందని, అవతలి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తే, పార్టీ సంకనాకి పోయే ప్రమాదం ఉందని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.

ఇప్పటికే తమ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సీట్లను ఖరారు చేసి మూడు పదుల కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోందని, దీనితో ఎంత మంది టికెట్లను దక్కించుకుంటారో, ఎంత మంది తమ ధనాన్ని రక్షించుకుంటారో చూడాలని అన్నారు. ప్రస్తుత సర్వేల ప్రకారం తమ పార్టీ ఓడిపోవడం ఖాయమని, పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారి పక్కనే పెత్తందారులైన సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గార్లు ఉన్నారని, వీళ్లను పక్కన పెట్టుకొని ఏ పెత్తందారులతో జగన్ మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారో చెప్పాలని అన్నారు. వీళ్ళతో కలిసి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలను దోచుకుంటున్నారని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారని, ఇక చంద్రబాబు నాయుడు గారి పల్లకిని మోస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలను ముద్రించడం సిగ్గుచేటని, కురుక్షేత్ర యుద్ధం వంటి ఎన్నికల సంగ్రామంలో రథంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉంటారని, సమిష్టిగా యుద్ధం చేసిన పాండవులు కౌరవులను అంతం చేసినట్లుగానే, ఎన్నికల సంగ్రామంలో తమ పార్టీని వారు ఓడించడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version