జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే జనవరి ఒకటి నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. 2023-24లో భాగంగా నవంబర్ నెలఖరు నాటికి 12.42 లక్షలమంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించారు.
ఇదే గతేడాది కంటే ఇది 24.64% అధికమని పేర్కొన్నారు. ఇక అటు 18 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సద్వినియోగంపై ముమ్మర ప్రచారం చేయాలని..దీనిలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని కోరారు. ఆస్పత్రుల్లో సిబ్బంది లేరన్న మాట వినిపించొద్దని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు ఇవ్వాలని పేర్కొన్నారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు, ఖాళీలు ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రజారోగ్య రంగంలో ఆరోగ్య శ్రీ అన్నది విప్లవాత్మక మార్పు అన్నారు.