జగనన్న ఆరోగ్య సురక్ష పై నిరంతరం సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య సురక్షలో మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాలి…రోగులకు మందులు అందించడం, అనంతరం ఫాలో అప్ చేయాలన్నారు. ముఖ్యంగా చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చుల కింద రూ.500లు ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఇన్‌పేషెంట్లుగా చేరిన వారిపై మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం జగన్…డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేసి అందిస్తున్న వైద్యంపై మరోసారి పరిశీలన చేయాలని పేర్కొన్నారు. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే జనవరి ఒకటి నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. 2023-24లో భాగంగా నవంబర్ నెలఖరు నాటికి 12.42 లక్షలమంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించారు. ఇదే గతేడాది కంటే ఇది 24.64% అధికమని పేర్కొన్నారు.