ఉద్యోగులకు ఏపీ జగన్ శుభవార్త చెప్పారు.. వారందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు జగన్ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే.. రేపు అసెంబ్లీలోకి బిల్లు రానుంది. ఇక మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని… ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు.
రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు ఊడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. రిటైర్ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు సీఎం జగన్. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్.