సీనియర్ జర్నలిస్టు గోశాల ప్రసాద్ మృతి.. సీఎం చంద్రబాబు, నారాలోకేశ్ సంతాపం

-

సీనియర్ జర్నలిస్టు గోశాల ప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంతాపం ప్రకటించారు. ‘నాలుగు దశాబ్దాలుగా జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకునిగా సమాజ హితం కోసం పాటుపడిన గోశాల ప్రసాద్ మృతి విచారకరం. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనపై ధైర్యంగా గళమెత్తిన ప్రసాద్.. తన లోతైన విశ్లేషణలతో ప్రజాపక్షాన నిలిచారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘గోశాల ప్రసాద్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగు దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో పనిచేసిన ప్రసాద్ అందరికీ సుపరిచితులు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తనదైన విశ్లేషణలతో గత ప్రభుత్వ విధ్వంస విధానాలను తీవ్రంగా నిరసించారు.ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషిచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని’ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version